లాక్‌డౌన్‌లో కారెక్కింది.. కటకటాల్లో దిగింది!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, రెండున్నర లక్షలకుపైగా మరణాలు సంభవించాయి.

 Poonam Pandey Arrested For Lockdown Violation, Poonam Pandey, Lockdown, Mumbai P-TeluguStop.com

ఈ మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.దాదాపు 45 రోజులకు పైగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఓ హీరోయిన్ పోలీసులు, అధికారుల మాటలను బేఖాతరు చేస్తూ రోడెక్కింది.బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది.

కాగా ఈసారి ఏకంగా తన లగ్జరీ కారులో లాక్‌డౌన్ వేళ షికారుకెళ్లింది.ముంబైలోని మరీనా డ్రైవ్ ఏరియాలో కారులో చక్కర్లు కొడుతున్న పూనమ్ పాండే, ఆమె స్నేహితుడిని పోలీసులు అడ్డుకున్నారు.

లాక్‌డౌన్ వేళ కారులో ఎక్కడికి వెళ్తున్నారనే ప్రశ్నకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న పరిస్థితుల్లో కారులో షికారుకెళ్లడం ఏమిటని ఆమెపై అభిమానులు మండిపడుతున్నారు.

ఇలా సెలబ్రిటీలు సైతం పోలీసుల మాటలను పెడచెవిన పెడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా కరోనా వైరస్‌తో సతమతమవుతున్న సమాజం పట్ల ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పలువురు ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube