ఈసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు అంటున్న కళా

ఈసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా ధ్వజమెత్తారు.

అడిషనల్ సీఈవో సుజాత శర్మను కలిసిన ఆయన అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈసీ అధికారుల తీరును తప్పుపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ బూత్ లలో అవకతవకలు జరిగాయని,వాటిలో రీపోలింగ్ జరగాలని సీఈవో ను కోరినట్లు తెలిపారు.పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గం లోని 166,310 బూత్ ల విషయంలో టీడీపీ అభ్యర్థి నాని ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ అధికారులు పోలింగ్ పూర్తి అయిన 24 రోజుల తరువాత వైసీపీ అభ్యర్థి కొన్ని బూత్స్ పై ఫిర్యాదు చేస్తే మాత్రం ఏవిధంగా స్పందిస్తారు అని ఆయన ప్రశ్నించారు.

అయినా పోలింగ్ పూర్తి అయిపోయిన తరువాత ఇప్పుడు మళ్లీ విచారణ ఏంటి? అని, దీనితో ఈసీ చిత్త శుద్ధి ఏంటి అనేది అర్ధం అవుతుంది అంటూ కళా వ్యాఖ్యానించారు.మరోపక్క సీఈవో సుజాత శర్మ మాత్రం ప్రస్తుతం సెలవు లో ఉన్న ద్వివేది తిరిగి వచ్చాక టీడీపీ ఫిర్యాదు పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు