దేవాలయంనకు వెళ్లిన దగ్గరి నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు మన దృష్టి దేవుని మీదే ఉండాలి.అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా వుండాలనే ఆచారాన్ని పెట్టారు.
దైవ దర్శన సమయంలో స్త్రీలు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను నిండుగా ధరించాలనీ, ఇక పురుషులు మాత్రం ఛాతి భాగం కనిపించేలా పలుచని వస్త్రాలు ధరించాలని పెద్దలు చెప్పారు.ఈ ఆచారాన్ని చాలా దేవాలయాలు పాటిస్తూ ఉన్నాయి.
అయితే ఈ ఆచారం వెనక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుందాం.
పురుషులు నడుము పైభాగాన వస్త్రాన్ని ధరించకుండా ఆలయంలోని విగ్రహం దగ్గరకి వెళ్లి ఆ స్వామి కృప తమకి కలగాలని ప్రార్ధిస్తారు.
దాని ఫలితంగా వాళ్ల మనసు పవిత్రమై ప్రశాంతత కలుగుతుంది.దైవం తమకి తోడుగా వున్నాడనే మానసిక భావన వాళ్లకి ఎంతో శక్తిని కలిగిస్తుంది.అలాగే పురుషులు దేవుడి విగ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆ విగ్రహంలోని వివిధ భాగాల నుంచి వెలువడే కొన్ని శక్తి కిరణాలు వాళ్ల శరీరంలో ప్రవేశించటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.అలాగే సంప్రదాయ బద్ధమైన వస్త్రాలతో దైవదర్శనం చేయడం వలన ఎలాంటి ఆకర్షణలకు లోను కాము.