వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరతాయా?

మనం ప్రతి రోజు దేవునికి పూజ చేసే సమయంలో పండ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటాం.అయితే ఒక్కో దేవతకు ఒక్కో పండు ఇష్టమని మీకు తెలుసా? ఏ దేవతకు ఏ పండు ఇష్టమో తెలుసుకొని నైవేద్యం పెడితే మనం అనుకున్న కోరికలు తీరతాయి.

అలాగే ఒక్కో పండుకు ఒక్కో కోరిక తీరుతుంది.

ఆ పండ్ల గురించి తెలుసుకుందాం.అరటిపండును నైవేద్యంగా పెడితే ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.

చిన్న అరటిని నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా జరుగుతాయి.అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యం పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి.

అంతేకాక ఏదైనా శుభకార్యం జరిగినపుడు అవసరమైన నగదు చేతిలోకి వస్తుంది.మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి.

Advertisement

కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే అనుకున్న పనులకు ఎటువంటి విఘ్నం కలగకుండా త్వరగా జరుగుతాయి.సఫోట పండును నైవేద్యంగా పెడితే పెళ్ళికి సంబందించిన ఆటంకాలు దూరం అవుతాయి.

కమలా పండును నైవేద్యంగా పెడితే ఎంతోకాలంగా ఆగిపోయిన పనులు చాల త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు