గ్రేటర్ ఎన్నికలు పూర్తయ్యయో లేదో మళ్ళీ తెరాస అప్పుడే మళ్ళీ తన ఆకర్ష ఆపరేషన్ మొదలు పెట్టేసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిథి లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే లు కారు ఎక్కబోతున్నారు అంటూ తెరాస వర్గాల నుంచి మనకి విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ఆ ఎమ్మెల్యే లు ఎవరు ఏ పార్టీ వారు అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇవాళ లేదా రేపు కెసిఆర్ ని వారు పర్సనల్ గా కలిసి అధికారిక ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది.
టీడీపీ – కాంగ్రెస్ లని చాలా వరకూ ఖాళీ చేసింది తెరాస ఇప్పటికే.టీడీపీ గ్రేటర్ పరిథిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుచుకున్న వారిని కూడా తెరాస ఇప్పటికే ఎగరేసుకుని పోయింది.
గ్రేటర్ ఎన్నికలలో తెరాస తిరుగులేని ఆధిక్యం సాధించడం తో మిగిలిన ఒకరు ఇద్దరు ఎమ్మెల్యే లు కూడా తెరాస వైపే చూస్తున్నారు అని సమాచారం.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అందులో ఒకరని బలంగా ప్రచారం జరుగుతోంది.
మిగతా ఇద్దరు ఎవరన్నది స్పష్టతరాలేదు.