రేషన్ షాపుల ద్వారా 10 కేజీల సన్న బియ్యం 12 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు),ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.

ఎస్.యు), ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డిటి ప్రియాంకకు వినతిపత్రం సమర్పించారు.

10 Kg Thin Rice And 12 Types Of Essential Items Should Be Given Free Of Charge T

ఈ సందర్బంగా పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి.డి.ఎస్.యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ లు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.అలాగే 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 1250 రూపాయలకు చేరిందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు.

ఇప్పటికైనా వంటగ్యాస్ ను సబ్సిడీతో 500 రూపాయలకు అందించాలని,అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి,రేషన్ షాపుల ద్వారా మంచి నూనె,కందిపప్పు,ఉప్పు, కారం,పసుపు తదితర 12 రకాల నిత్యవసర సరుకులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డులలో నూతన పేర్ల నమోదుకు ఆన్లైన్ చేసుకొని సంవత్సరాలు గడిస్తున్న పేర్లు నమోదు కావటం లేదని అన్నారు.

Advertisement

ప్రతి పౌరుడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 10 కేజీల సన్నబియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ, పివైఎల్ జిల్లా నాయకులు వీరబాబు,శ్రీకాంత్, పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు సింహాద్రి, నితిన్,మౌనిక,సునీత, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News