యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పనుల కార్మికులపై దుసుకేల్లిన బస్సు..ముగ్గురు మృతి .

భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కూలి పనులు చేస్తున్న కార్మికులపై మృత్యు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను కబళించింది.

వివరాల్లోకి వెళితే హెచ్ఎంటి కాంట్రాక్టు సంస్థలో గత కొంత కాలంగా రాయగిరి-వరంగల్ రోడ్డు పనులు నడుస్తున్నాయి.అందులో భాగంగా ఆదివారం రోజు రోడ్డుపై ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తున్నటువంటి కూలిలపై వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతున్న డీలక్స్ బస్సు దూసుకెళ్లడంతో అంకర్ల లక్ష్మీ,ఊరేళ్ళ శ్యామ్,అంకర్ల కవిత అక్కడిక్కడే మృతి చెందరు.

Three Killed In Road Mishap In Yadadri District-యాదాద్రి జి�

వీరి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి.కార్మికులను ఢీ కొట్టిన అనంతరం అక్కడే పక్కకు ఆగి ఉన్న ట్రాక్టర్ ని బస్సు డీకొనడంతో ట్రాక్టర్ మొత్తం నుజ్జునుజ్జు అయింది.

మృతులంతా భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.పోలీసులు సంఘటన స్థలాని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల
Advertisement

తాజా వార్తలు