ప్రాచీన శివాలయ నూతన కమిటీ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ ప్రాచీన ఉమామహేశ్వర శివాలయం నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు.

నూతన అధ్యక్షుడిగా పాలకూర్ల సతీష్ గౌడ్,ప్రధాన కార్యదర్శిగా సూరపల్లి జవహర్,సహాయ కార్యదర్శులుగా సోమనబోయిన కృష్ణ కుమార్,బాకారం గణేష్, సాగర్,సూర చిన్న రాజయ్య, కోశాధికారిగా దూసరి శ్రీను,ప్రచార కార్యదర్శిగా గోల్లూరు శ్రీశైలం ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ శివరాత్రి జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో దేవాలయ మాజీ అధ్యక్షుడు పల్లె గోపాల్ రెడ్డి, పాలకూర్ల గిరి,పల్లె సీతారాంరెడ్డి, కేశవులు పాలకూర్ల యాదయ్య, సాధు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Election Of New Committee Of Ancient Shiva Temple , Ancient Shiva Temple , Elect

Latest Suryapet News