టీఆర్ఎస్ మోసాలపై న్యాయ పోరాటం చేస్తాం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కానీ ఎన్నో హామీలనిచ్చి ఓట్లు వేయించుకుని అధికారoలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కాలయాపన చేస్తూ చేస్తున్న మోసాలపై న్యాయ పోరాటాo చేస్తామని జనసమితి లీగల్ సెల్ నాయకులు బుధవారం సూర్యాపేటలో ప్రకటించారు.

ఈ నెల 6న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ 2వ ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మరిచి కేసీఆర్ కుటంబపాలన చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా నాయకులు కుంచం చంద్రకాంత్, గుడుగుంట్ల ప్రకాష్,మాంద్ర మల్లయ్య,వీరేశ్ నాయక్, రామకృష్ణ,మురళి తదితరులు పాల్గొన్నారు.

We Will Fight For Justice On TRS Scams-టీఆర్ఎస్ మోసాల�

Latest Suryapet News