షర్మిల సభలో జగన్ ప్రస్తావన తీసుకు వచ్చిన విజయమ్మ..!!

తెలంగాణ రాజకీయలలో కొత్త శకం మొదలైంది.దివంగత వై.

ఎస్ కూతురు ఏపీ సీఎం జగన్ చెల్లె వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది.

తండ్రి వైయస్ జయంతి రోజు కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మొట్టమొదటి పొలిటికల్ బహిరంగసభలో తెలియజేసింది.

ఇదిలా ఉంటే ఈ సభకు ముఖ్య అతిథిగా వైయస్ విజయమ్మ హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

రాజకీయంగా వైయస్ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయం లో ప్రజలే అక్కున చేర్చుకున్నారు.మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, మీతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం ఎవ్వరూ చెరప్పలేనిది అంటూ విజయమ్మ స్పష్టం చేశారు.

Advertisement

షర్మిలమ్మ పాదయాత్ర గాని ఇంకా అనేక సమయాలలో వైఎస్ కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారని విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.రాజశేఖర్ రెడ్డి పాలన గురించి ప్రస్తావించిన విజయమ్మ మధ్యలో వైఎస్ జగన్ ప్రస్తావన కూడా తీసుకు రావడం జరిగింది.

తండ్రి వైఎస్ కి ఉన్న కమిట్మెంట్ విలువలతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడుతుందని విజయమ్మ స్పష్టం చేశారు.వైయస్ నమ్మిన వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తి అని పేర్కొన్నారు.

వైయస్ మాట చాలా విలువైనది అని, ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా ఆయన వెళ్తారు. అదే తరహాలో ఇచ్చిన మాట కోసం జగన్ ఇప్పుడు ఎంత దూరం వెళ్లారు అన్నది మీ అందరూ చూస్తున్నారు అని విజయమ్మ చేసిన ప్రసంగానికి స్టేజి దద్దరిల్లింది.

కాగా షర్మిల కూడా అదే కమిట్మెంట్ తో మీ ముందుకు వస్తుంది. రాజన్న బిడ్డను ఆదరించండి అంటూ తెలంగాణ ప్రజలను వైఎస్ విజయమ్మ ఈ సంకల్ప సభ లో కోరడం జరిగింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

 .

Advertisement

తాజా వార్తలు