జ‌గ‌న్‌కి-వైఎస్‌కి మ‌ధ్య ఇదే పెద్ద డిఫ‌రెన్స్‌... !

దివంగ‌త వైఎస్ జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎంతో ఉద్విగ్న భ‌రిత హృద‌యాల‌తో నిర్వ‌హించుకుంటున్నారు.వైఎస్ ప్ర‌మాద‌వ‌శాత్తు ప్ర‌జ‌ల‌కు దూర‌మై.

ఏళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ.ఆయ‌న జ్ఞాప‌కాలు మాత్రం ప్ర‌జ‌ల మ‌దిలో ఇంకా మెరుస్తూనే ఉన్నాయి.2009లో నాటి స‌మైక్య రాష్ట్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ కొద్ది రోజుల‌కే విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.ఆయ‌న చేసిన కార్య‌క్ర‌మాలు, ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కూడా ఇప్ప‌టికీ.

Difference Between Jagan And Ysr,YS Raja Sekhar Reddy,jagan Mohan Reddy,differen

ప్ర‌జ‌ల క‌ళ్ల‌లో ఆనందం రూపంలో క‌నిపిస్తూనే ఉన్నాయి.ఇక‌, ఈ క్రమంలో వైఎస్ రేంజ్‌ను అందుకునే నాయ‌కుడు ఏపీలో కానీ , తెలుగునేల‌పై కానీ ఉన్నాడా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.నిజ‌మే.

ఆ క‌ట్టుబొట్టు.గాంభీర్యం.

Advertisement

ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ల‌క్ష‌ణం వంటివాటి విష‌యంలో వైఎస్‌ను మించిన నాయ‌కుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఈ త‌ర‌హా ఫాలోయింగ్ ఆయ‌న త‌న‌యుడు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌కు ల‌భిస్తుందా ?  ఆయ‌న‌కు వైఎస్‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏంటి ?  అనే విష‌యాలు ప‌రిశీలిస్తే.వైఎస్ ప్ర‌జ‌ల మ‌నిషిగా.

ప్ర‌జానాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల మొర విన్న వైఎస్‌.

ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై అనేక రూపాల్లో ప‌థ‌కాల‌ను రూపొందించారు.వాటిని అమ‌లు చేసి చూపించారు.

అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.ఎక్క‌డా త‌న సొంత‌పేరును వినియోగించాలనే ఆలోచ‌న కూడా వైఎస్ చేసింది లేదు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?

ఏ ప‌థ‌కానికైనా వైఎస్‌.గాంధీల కుటుంబానికి చెందిన రాజీవ్‌, ఇందిర పేర్ల‌ను వినియోగించేవారు.

Advertisement

దీంతో అటు పార్టీలోనూ ఇటు ప్ర‌జ‌ల‌కు కూడా వైఎస్ చేరువ‌య్యారు.ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే టాక్ అయితే ప్ర‌స్తుతం ఎక్కువ‌గానే ఉంది.వైఎస్‌లో శ‌త్రువుల‌ను కూడా ద‌గ్గ‌ర‌కు తీసుకుని వారిని త‌న వాళ్ల‌ను చేసుకునే గుణం ఎక్కువ‌.

జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాత్రం అది లేద‌నే చెప్పాలి.ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర త‌ర్వాత సీఎం అయ్యారు.

ఆ త‌ర్వాత ఆ రేంజ్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం అంటూ ఏమీలేదు.పైగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని, వారి మొర ఆలకించిందీ లేదు.

పైగా చాలా వ‌ర‌కు ప‌థ‌కాల‌కు త‌న‌పేరునే ఆయ‌న వాడుకుంటున్నారు.ఈ నేప‌థ్యంలో వైఎస్‌ను డామినేట్ చేయ‌డం అనేది జ‌గ‌న్‌కు ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు