నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్( YCP MP Nandigam Suresh ) టీడీపీ యువనేత నారా లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Arrest )కి అవినీతి కొత్త కాదని పేర్కొన్నారు.

₹371 కోట్లు దోచేసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు.ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఇంత దోచేస్తే.

ఇన్నేళ్లు ఇంకా ఎంత అవినీతి చేశారో అంటూ.సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు గురించి జాతీయస్థాయిలో అందరికీ తెలుసు కాబట్టి లోకేష్ ని ఢిల్లీలో ఎవరు పట్టించుకోవటం లేదని నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.అరెస్టు భయంతోనే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారని విమర్శించారు.

Advertisement

ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ పర్యటన( Nara Lokesh Delhi Tour )లో ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి ఢిల్లీలో పేరుగాంచిన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

మరోపక్క వైసీపీ ప్రభుత్వం కావాలని అక్రమంగా అరెస్టు చేసినట్లు.జాతీయస్థాయి నేతల దృష్టికి తీసుకెళుతున్నారు.

లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టి ఆరు రోజులు కావస్తుంది.ఈ క్రమంలో అక్కడనుండే రాష్ట్రంలో ఉన్న నేతలతో.

జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ.దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం

గురువారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.ఈ సమావేశాలలో తెలుగుదేశం పార్టీ నేతలను( TDP leaders ) పాల్గొనాలని ఢిల్లీ నుండి లోకేష్ నేతలకు తెలియజేయడం జరిగింది.

Advertisement

చంద్రబాబు అక్రమ అరెస్టు ఇంకా ప్రజా సమస్యలపై నిలదీసేందుకు చట్టసభల వేదిక వదులుకోవద్దని నేతలకు సూచించారు.

తాజా వార్తలు