టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) “యువగళం” పాదయాత్ర( Yuvagalam Padayatra ) ప్రస్తుతం జంగారెడ్డిగూడెం జిల్లాలో సాగుతోంది.ఈ ఏడాది జనవరి 27వ తారీకు ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 2600 కిలోమీటర్లకు పైగా నడవడం జరిగింది.
మొత్తం నాలుగువేల కిలోమీటర్లు నడవాలని లోకేష్ టార్గెట్ పెట్టుకొనడం జరిగింది.పాదయాత్రలో ప్రజా సమస్యలపై స్పందిస్తూనే మరోపక్క వైసీపీ పార్టీపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే లోకేష్ “యువగళం” పాదయాత్రపై వైసీపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) మండిపడ్డారు.
రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతుందని స్పష్టం చేశారు.పార్టీ, కులం చూడకుండా రాష్ట్రంలో లబ్ధిదారులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు చేస్తున్నాయని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీ( TDP ) హయాంలో 40 లక్షల దొంగ ఓట్లు సృష్టించారని.
ఇప్పుడు ఈసీ సర్వేతో చంద్రబాబుకి చెమటలు పడుతున్నాయని ఆరోపించారు.లోకేష్ ది “యువగళం” పాదయాత్ర కాదు గందరగోళం పాదయాత్ర అని సెటైర్లు వేశారు.