పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో స్వీట్ కార్న్( Sweet Corn ) ఒకటి.అయితే చాలా మంది స్వీట్ కార్న్ ను ఒక చిరుతిండిగా మాత్రమే చూస్తుంటారు.
కానీ స్వీట్ కార్న్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు తింటే మీరు ఆశ్చర్యపోయే లాభాలు మీ సొంతమవుతాయి.
రక్తహీనతతో( Anemia ) బాధపడేవారికి స్వీట్ కార్న్ మంచి ఎంపిక అవుతుంది.స్వీట్ కార్న్ లో విటమిన్ బి12 మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాలను ఏర్పరచడానికి మరియు రక్తహీనతను నివారించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.అలాగే ఫైబర్ కు స్వీట్ కార్న్ గొప్ప మూలం.
స్వీట్ కార్న్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా పని చేస్తుంది.మలబద్ధకం( Constipation ) సమస్య ఉంటే దూరం అవుతుంది.
స్వీట్ కార్న్ లోని ఫైబర్ మరియు ఇతర పోషకాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్స్, టైప్ 2 డయాబెటిస్, ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్ లుటీన్ మరియు జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి.థయామిన్, రిబోఫ్లావిన్ మరియు నియాసిన్ వంటి బి విటమిన్లు స్వీట్ కార్న్ లో మెండుగా ఉంటాయి.ఇవి శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి.
అంతేకాదండోయ్.స్వీట్ కార్న్ ను డైట్ లో చేర్చుకుంటే అందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.మధుమేహం ఉన్నవారు కూడా స్వీట్ కార్న్ తినొచ్చు.ఫైబర్ రిచ్ గా ఉండటం వల్ల స్వీట్ కార్న్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులోకి ఉంచుతాయి.ఇక స్వీట్ కార్న్ అతి ఆకలి అణచివేస్తుంది.కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.
ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.