సొరకాయ ర‌సం తాగితే..ఎన్ని జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చో తెలుసా?

సొర‌కాయ‌.చాలా మంది ఇష్ట‌ప‌డ‌ని కూర‌గాయ ఇది.ముఖ్యంగా పిల్ల‌లు, యువ‌త సొర‌కాయ‌ను ద‌రి దాపుల్లోకి కూడా రానివ్వ‌రు.

కానీ, సొర‌కాయ‌లో కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, జింక్, సోడియం, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్‌, కార్బొహైడ్రేట్స్, విట‌మిన్ సి, విటిమ‌న్ బి1, విట‌మిన్ బి6, విట‌మిన్ బి9 ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అటువంటి స‌ర‌కాయ‌ను దూరం పెడితే.అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోయిన‌ట్టే అవుతుంది.అలా అని మిమ్మ‌ల్ని బ‌ల‌వంత‌గానూ సొర‌కాయ‌ను తిన‌మ‌ని చెప్ప‌డం లేదు.

కూర‌ల రూపంలో తిన‌లేని వారు.సొర‌కాయ‌తో ర‌సం త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

సొర‌కాయ ర‌సంను తీసుకోవ‌డం వ‌ల్ల‌ బోలెడ‌న్ని జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు, యూరినరీ ఇన్ఫెక్షన్ మరియు మూత్ర సంబంధ వ్యాధుల‌తో బాధ ప‌డే వారు త‌ర‌చూ సొర‌ కాయ ర‌సం తీసుకోవ‌డం ఎంతో ఉత్తమం.

Advertisement

ఎందుకంటే, అటువంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ సొర‌కాయ ర‌సం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

నిద్ర‌లేమికి చెక్ పెట్ట‌డంలోన స‌ర‌కాయ ర‌సం ఉప‌యోగ‌ప‌డుతుంది.ఎవ‌రైదే నిద్రలేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు డిన్న‌ర్ త‌ర్వాత ఒక గ్లాస్ సొర‌కాయ ర‌సం తీసుకుంటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు స‌ర‌కాయ ర‌సాన్ని తీసుకుంటే రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

అధిక వేడితో ఇబ్బంది ప‌డే వారు సొర‌కాయ ర‌సం తీసుకుంటే.క్ష‌ణాల్లోనే శ‌రీరం చ‌ల్ల‌ప‌డుతుంది.అంతేకాదు, త‌ర‌చూ సొర‌కాయ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు.చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అరవింద్...వీడియోలు వైరల్!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది.

Advertisement

శ‌రీరంలో వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోతాయి.జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది.

మ‌రియు శ‌రీరానికి ఎంతో శ‌క్తి కూడా ల‌భిస్తుంది.

తాజా వార్తలు