బతుకమ్మ పాటలతో.. మారుమోగుతున్న వేములవాడ పరిసర ప్రాంతాలు!

వేములవాడలో ఆకాశాన్ని అంటిన పూల పండుగ జాతర!కనీవిని ఎరుగని రీతిలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది జనం రాజన్న సిరిసిల్ల జిల్లా :నేడు ఆధ్యాత్మిక క్షేత్రంలో అంబరాన్నింటిన సద్దుల బతుకమ్మ సంబురాలు.

ఊరువాడా.

రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు.

With The Songs Of Bathukamma The Surrounding Areas Of Vemulawada Are Resounding

పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు.అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.

Advertisement

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్, రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్ దగ్గర ఉండి బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బతుకమ్మ వేడుకలు సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొన్నన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News