శివుడు పార్వతీదేవికి తనలో సగ భాగాన్ని ఎందుకిచ్చాడు?

శివపార్వతుల జంట చూడ చక్కనైన జంట.పెళ్లైన వాళ్లందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల్లా కలిసుండాలని చాలా మంది చెబుతుంటారు.

 Why Did Lord Shiva Give Half Of His Body To Goddess Parvati, Devotiona , Lord Sh-TeluguStop.com

అంతేకాదు వాళ్లలాగానే.భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ ఎక్కువా కాదు, ఏ ఒక్కరూ తక్కువా కాదనే భావనతో మెలగాలని సూచిస్తుంటారు.

భార్యాభర్తలిద్దరూ సమానమని చూపించేందుకే శివుడు తనలోని సగభాగాన్ని పార్వతీ దేవికి ఇచ్చాడని కూడా చెబుతుంటారు.కానీ అదంతా నిజం కాదు.

శివుడు అర్థ నారీశ్వరుడు అయ్యేందుకు ఓ కారణం ఉంది.అదేంటో ఇప్పుడు చూడండి.

ఒకానొక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీ దేవి శివుడి పక్కనే ఉన్నా.ఆమెను పట్టించుకోకుండా పరమేశ్వరుడిని ప్రార్థించాడట.

అతడి భక్తిన మెచ్చిన శంకరుడు కరుణించాడట.ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పార్వతీ దేవికి కోపం వచ్చి… శివుడిపై అలిగిందట.

భక్తులపై ఉన్న ప్రేమ తనపై లేదంటూ బాధపడిందట.అదే కోపంతో.

పార్వతీదేవి కేదార క్షేత్రంలోని గౌతమ ముని వద్దకు వెళ్లి ఉపదేశం తీసుకుందట.కేదారేశ్వరుడిని స్మరిస్తూ చాలా కాలం తపస్సు చేసింది.

Telugu Devotional, Parama Shivudu, Parvathi Devi-Telugu Bhakthi

గౌరీదేవి తపస్సుకు మెచ్చిన ఆ భోళా శంకరుడు… ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమ్మన్నాడట.అప్పుడు పార్వతీ దేవి నేను నీ పక్కనున్నా.నన్ను కొందరు పట్టించుకోవట్లేదు కాబట్టి నీలో సగ భాగం కావాలని అడిగిందట.అందుకు ఒప్పుకున్న శివుడు.వెంటనే తన భార్య అయిన పార్వతీ దేవికి తనలో సగ భాగాన్ని ఇచ్చాడు.అప్పటి నుంచి భార్యా భర్తలిద్దరూ సమానమని చెప్తూ… అర్థనారీశ్వరుడు అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube