నాని తన కెరియర్ లో రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరో లలో నాని( Nani ) ముందు వరుసలో ఉన్నాడు.ఈయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే దానికి కారణం ఇక రీసెంట్ గా ఈయన దసర సినిమాతో( Dasara Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Hero Nani Taking Wrong Step In His Career Details, Nani, Hero Nani , Venu Yeldan-TeluguStop.com

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఇక ఇప్పుడు డిసెంబర్ 7వ తేదీన హాయ్ నాన్న( Hi Nanna ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…ఇక ఈ సినిమా మీద నాని భారీ ఆశలు పెట్టుకున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే నాని బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

నానినే స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు.అయితే ఈ సినిమా ఏ విధమైన కథాంశం తో తెరకెక్కుతుంది అనేది మాత్రం ఇప్పుడప్పుడే తెలియదు కానీ వేణు( Balagam Venu ) ఇంతకు ముందు చేసిన బలగం సినిమా( Balagam Movie ) విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.కాబట్టి ఇక ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయంటూ ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి.

 Hero Nani Taking Wrong Step In His Career Details, Nani, Hero Nani , Venu Yeldan-TeluguStop.com

అయితే నాని వేణు డైరెక్షన్ లో సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల ఆవేదన ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఇప్పుడు నాని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో వేణు తో సినిమా చేయడం అవసరమా అంటూ అభిమానులు కూడా కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి నాని తను అనుకున్న రీతిలో వేణుతో సినిమా చేసే సక్సెస్ కొడతాడా లేదా ఫెయిల్యూర్ గా మిగులుతాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube