పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు.
సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.అయినా కూడా ఇంత వరకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు.

ఏదో కొన్ని పోస్టర్స్, టీజర్, పాటలు రిలీజ్ చేసారు.అంతే కానీ అంతకుమించి మరిన్ని ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ టీమ్ మీద గుర్రుగా ఉన్నారు.అయితే నిన్నటి నుండి మళ్ళీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.నిన్న 10 రోజుల్లో మూవీ రిలీజ్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఈ రోజు 9 రోజుల్లో రిలీజ్ అంటూ మరో స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో పవన్ లుక్ బాగా ఆకట్టు కుంటుంది.గిటార్ పట్టుకుని పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించగా పక్కనే సాయి తేజ్ కూడా ఉన్నాడు.
ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.మరి పెద్దగా ప్రమోషన్స్ లేకపోయిన పవర్ స్టార్ మాత్రం ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తున్నాడు.
ఎందుకంటే బిజినెస్ కూడా ఎప్పుడు లేని విధంగా జరిగింది అని సమాచారం.

అంతేకాదు ఇప్పుడు తాజాగా ఈ సినిమా టికెట్స్ ఓపెన్ అవ్వగా 10 నిముషాల్లోనే ఏకంగా 2000 టికెట్స్ అమ్ముడు పోయాయని టాక్.ఇలా మొత్తంగా పవర్ స్టార్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.కాగా ప్రియా ప్రకాష్ వారియర్,( Priya Prakash Varrier ) కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.







