భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీకానున్నారు.ఈ సమావేశానికి మాణిక్ రావు ఠాక్రేతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరు కానున్నారు.
పార్టీలో కొత్తగా చేరే నాయకులు ఎవరు.? వారిని ఎలా చేర్చుకోవాలనే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా రేపు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరే వారి జాబితాపై పార్టీ నేతలు కసరత్తు చేయనున్నారు.తెలంగాణలో ప్రియాంక గాంధీ సభపై కూడా నేతలు మంతనాలు జరపునున్నారని సమాచారం.
కాగా ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.







