ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana congress ) కు పెరిగిన గ్రాఫ్ తో ఆ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.కచ్చితంగా పార్టీ నేతలంతా సమిష్టిగా కృషి చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలనే ప్లాన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఉంది.ఇక తెలంగాణలో బీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకోవాలని, ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అంతా భావిస్తున్నారు.
<img src="“/>
దీనిలో భాగంగానే కీలక నాయకులంతా ఈరోజు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( komatireddy venkatareddy Reddy ) నివాసంలో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన కీలక అంశాల పైన చర్చించనున్నారు.
ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడురేవంత్ రెడ్డి( Revanth reddy ) తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నాయకులంతా పాల్గొనబోతున్నారు.ఈ సందర్భంగా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీలో చేరికలు, ప్రచార వ్యవహాల పైన చర్చించనున్నారు.

అలాగే బీ ఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఏం చేయాలనే విషయం పైన ప్రధానంగా చర్చించనున్నారు.ఇప్పటికే ఇతర పార్టీలోని కీలక నేతలు చాలామంది కాంగ్రెస్ లో చేయగలరు సిద్ధమవుతున్నారు.వీరితోపాటు చేరేందుకు సిద్ధంగా ఉన్న కీలక నేతలు చాలామంది ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఒత్తిడి చేస్తుండడం ,టిక్కెట్ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో, చేరికలు విషయంలో ఏం చేయాలనే విషయం పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.అలాగే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ప్రజల మద్దతు కాంగ్రెస్ కు ఉండేలా చేసుకునేందుకు ఏం చేయాలనే విషయం పైన ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు







