టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
సముద్రఖని( Samuthirakani ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ ప్రియా వారియర్ ( Priya prakash varrier )ముఖ్యపాత్రలో నటించింది.కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాత.
తమిళ సినిమా వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ప్రమోషన్స్ లో భాగంగా ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ప్రియ వారియర్ మాట్లాడుతూ.కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను.పవన్ కళ్యాణ్ తన నటనతో మ్యాజిక్ చేస్తారు.పవన్ సెట్‌లో అడుగుపెడితేనే ఏదో అనుభూతి కలుగుతుంది దానిని మాటల్లో చెప్పలేమూడు అని చెప్పుకొచ్చింది.
సినిమాలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తనకు మరీ ఎక్కువ సన్నివేశాలు లేవు.

ఆయన చాలా కామ్‌గా ఉంటారు.కానీ ఆయన సెట్స్‌లో అడుగుపెడితే మాత్రం అందరిలో ఉత్సాహం వస్తుంది.ఆయన ఆ స్థాయికి చేరుకున్న చాలా జెంటిల్‌గా ఉంటారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాను అంటూ పవన్ పై పొగడ్తల వర్షం కురిపించింది ప్రియా ప్రకాష్ వారియర్.అనంతరం సినిమాలో అవకాశం రావడం గురించి స్పందిస్తూ.
మా అమ్మ చెప్పడంతో నేను అప్పటికే తమిళ మూవీ వినోదయ సిత్తం చూశాను.సినిమా నాకు చాలా బాగా నచ్చింది.
బ్రో కోసం సముద్రఖని ఫోన్ చేసి లుక్ టెస్ట్ నిమిత్తం రమ్మన్నారు.ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు సముద్రఖని.
నాలాంటి నూతన నటికి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది అని తెలిపింది ప్రియా ప్రకాష్.







