డైరెక్టర్ విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఉగ్రం.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, మిర్జామీనన్ కీలక పాత్రలో నటించారు.
శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించగా.సిద్ధార్థ జై సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను భారీ అంచనాలలో ముంచాయి.ఇప్పటికే కామెడీ పరంగా కాకుండా మంచి యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.
ఇప్పుడు ఈయన చేసే సినిమాలను చూస్తే ఒకప్పటి కామెడీ హీరో అనే సంగతే గుర్తుకు రాదు.అయితే ఈరోజు ఈయన నటించిన ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.
ఈ సినిమా ఆయనకు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో అల్లరి నరేష్ సిఐ శివకుమార్ పాత్రలో కనిపిస్తాడు.
ఇక హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్స్ పెరిగిపోతున్న సమయంలో ఆడపిల్లలు, మహిళలు మిస్ అవుతూ ఉంటారు.ఇక అదే సమయంలో సిఐ శివకుమార్ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోతారు.
ఇక ఆ సమయంలో శివకుమార్ కి ఒక భయంకరమైన నేపథ్యం కూడా ఉంటుంది.ఇక చివరికి శివకుమార్ ఆ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న వ్యక్తిని ఎలా పట్టుకుంటాడు.
చివరికి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
అల్లరి నరేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పోలీస్ పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.హీరోయిన్ మిర్నా కూడా అద్భుతంగా నటించింది.
ఇక ఇంద్రజ( Indraja ) డాక్టర్ పాత్రలో బాగా ఆకట్టుకుంది.మిగిలిన నటీనటులంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ మంచి కథను తీసుకున్నప్పటికీ కూడా కథనాన్ని సరిగా చూపించలేకపోయాడు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది.సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.
మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.
విశ్లేషణ:
డైరెక్టర్ విజయ్ మంచి కథను ప్రిపేర్ చేసుకున్నాడు కానీ.కథనం విషయంలో బాగా ఇంట్రెస్ట్ పెడితే బాగుండేది.ఫస్టాఫ్ మొత్తం నెమ్మదిగా సాగినట్లు అనిపించగా లవ్ ట్రాక్ అంతగా కనెక్ట్ కాలేకపోయింది.
దాదాపు సినిమా మొదలైన 20 నిమిషాలు తర్వాత స్టోరీ ప్రారంభమవుతుంది.ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఒకింత ఊరట కలిగిస్తాయని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
: నరేష్ నటన, ట్విస్టులు, ఇంటర్వెల్ సీక్వెన్స్.
మైనస్ పాయింట్స్:
లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.ఫస్టాఫ్ బోరింగ్ గా అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే కథ బాగున్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే కాస్త నిరాశపరిచింది.కథనం కూడా కాస్త నెమ్మదిగా ఉంది.ఇక సినిమా టోటల్గా రొటీన్ మాస్ యాక్షన్ డ్రామా లాగా సాగింది.యాక్షన్ సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.కొంతవరకు అల్లరి నరేష్( Allari Naresh ) ఈ సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.