కేసిఆర్( CM kcr ) ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి గురై, బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్ళగకుతున్న సంగతి తెలిసిందే.కొంతమంది తమ ఆవేదనను కేసీఆర్ పట్టించుకుంటారని ప్రకటించినా, అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులు చేపట్టి తమకు అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకోగా, మరి కొంతమంది నేతలు మాత్రం కాంగ్రెస్ బిజెపి( BJP party )తో సంప్రదింపులు చేస్తున్నారు.
టిక్కెట్ ఇస్తామనే హామీ దక్కితే వెంటనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు .ఈ లిస్టులో చాలామంది కీలక నేతలే ఉండడంతో , వారి కారణంగా ఎన్నికల సమయంలో పార్టీకి జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని కెసిఆర్ అంచనా వేస్తున్నారు.దీంతోపాటు తమ రాజకీయ ప్రత్యర్థులు బలపడేందుకు ఇది అవకాశంగా మారుతుందని భావిస్తున్నారు.అందుకే టిక్కెట్ల ప్రకటన తర్వాత ఎవరెవరు అసంతృప్తి కి గురయ్యారు ? ఎవరు పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు ? ఏ పార్టీతో ఎక్కువగా సంప్రదింపులు చేస్తున్నారు అనే విషయాలపై నియోజకవర్గాల వారిగా కెసిఆర్ ఆరా తీస్తూ.నియోజకవర్గాలు, జిల్లాల వారీగా దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ తీసుకుంటున్నారట.
ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ టికెట్ పై ఆశలు పెట్టుకున్న కీలక నేతలు చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కేసీఆర్ గుర్తించారు .ఇటువంటి వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని, లేకపోతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి అని కేసిఆర్ భావిస్తున్నారు.అసంతృప్తులను వదిలించేందుకు ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలను కేసీఆర్ రంగంలోకి దించారట.
ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తనకు టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్( Congress ) లో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.ఇక నకిరేకల్ నుంచి టిక్కెట్ ఆశించి బంగపడిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కేడర్ తో సమావేశమయ్యారు .కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి .అలాగే పెద్దపల్లి నుంచి టిక్కెట్ ఆశించిన నల్ల మనోహర్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
నర్సంపేట నుంచి పోటీ చేయాలని భావించిన ఉద్యమ నేత డాక్టర్ మదన్ కుమార్ టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. అలాగే మధిర కు చెందిన బొమ్మెర రామ్మూర్తి( Bommera Rama Murthy ) నియోజక కేంద్రంలో ధర్నా సైతం నిర్వహించారు.అలాగే ఎల్బీనగర్ టికెట్ ఆశించి మంగపడిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ గౌడ్ సైతం తన కేడర్ తో భేటీ అయ్యారు .పార్టీ మారే విషయంపై చర్చిస్తున్నారు.అంబర్ టికెట్ వెంకటేష్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి దక్కకపోవడంతో ఆయన అనుచరులు నిరసన ర్యాలీ చేపట్టారు.Sye టిక్కెట్ ఆశించిన బండి రమేష్ సైతం తన అమెరికా పర్యటన ముగించుకుని కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయన వద్దే తేల్చుకుంటానని ప్రకటించారు.
ఇక స్టేషన్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య బోరున విలపించారు.ఆయన సైతం కాంగ్రెస్ లేదా బీఎస్పీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు సైతం పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారట.
.