దీపారాధన లో ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి?

విజయం కోరి శివుడును ప్రార్ధించే వారికి వేప నూనె , ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది.కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధ నారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది.

 Which Lamp Is Preferred During Pooja, Pooja, Deeparadhana, Oil , Devotional, Telugu Devotional-TeluguStop.com

విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు.

దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు.నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం.

 Which Lamp Is Preferred During Pooja, Pooja, Deeparadhana, Oil , Devotional, Telugu Devotional-దీపారాధన లో ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.ఆవునేతితో దీపారాధన చేయడం శ్రేష్ఠం.

ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది.దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.

దీపం సకల దేవతాస్వరూపం దీపం పరబ్రహ్మ స్వరూపం.దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని పెద్దల మాట .దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి.దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి.

పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం.దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు.

కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.

Video : దీపారాధన లో ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి? -

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube