మిషన్ భగీరథ శుద్ధి నీరెక్కడ...?

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా ఆర్భాటమే తప్ప ఆచరణ మాత్రం ఉండదని చెప్పడానికి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా శుద్ధి చేసిన తాగునీరు అందిన పాపాన పోలేదని ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పాటైన మిషన్ భగీరథ పథకం కాంట్రాక్టర్లు పొట్ట నింపేందుకు తప్ప పేదల గొంతు తడిపేందుకు ఉపయోగపడలేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాలే కాకుండా మున్సిపాలిటీల్లో సైతం మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా అందకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.మిషన్ భగీరథ పథకం అమలుకు నోచుకోకపోవడంతో మారుమూల గ్రామాలు,గూడేలు, తండాల ప్రజలు ప్రత్యామ్నాయంగా తమ గ్రామాల్లో ప్రైవేట్ బోర్లు ఏర్పాటు చేసుకొని తాగునీరు సమస్యలు తీర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.

అంతే కాకుండా గ్రామాలలో పట్టణ కేంద్రాల్లో వీధికో ప్రైవేట్ ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ లు వెలిశాయి.దీంతో మిషన్ భగీరథ పథకం అటకెక్కిందని,అసలు మిషన్ భగీరథ నీరు సరఫరా అయితే ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఎందుకు వెలుస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

మిషన్ భగీరథ అధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుందని,వారు ఎక్కడా కనిపించరని,ఫోన్ చేసినా స్పదించారని ప్రజలు వాపోతున్నారన్నారు.దీనికి తోడు గ్రామపంచాయతీలు కూడా తాగునీటిపై శ్రద్ధ చూపుకపోవడం తాగునీటి సమస్య పెరిగిపోతుందని,దీనిని అధిగమించేందుకు గ్రామాలలో అప్పుచేసి సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

శూన్యంపహాడ్ మహిళా ఎంపీటీసీ మాట్లడుతూ నల్లాలు కొంతవరకే అమర్చారు.మా గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి.

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎత్తులో ఏర్పాటు చేశారు.ఆ ట్యాంక్ కి నీరు అందడం లేదు.

పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.భగీరథ వచ్చిన దగ్గర నుండి పంచాయతీ సర్పంచ్ కూడా నీటి గురించి పట్టించుకోవడం లేదు.

మా గ్రామంలో ఇటీవల ఇండ్లలో సుమారు10 బోర్లు వేయించుకున్నారు.నేరేడుచర్ల 2వ వార్డ్ కౌన్సిలర్ నాగయ్య మాట్లడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీగా ఏర్పడి జనవరికి మూడేళ్ళు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

ఒక సంవత్సరం ముందే మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించారు.నేటికీ నల్లాల కలెక్షన్ ఇవ్వలేదు.

Advertisement

వార్డ్ ప్రజలకు మిషన్ భగీరథ నీరు రాలేదు.ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నము.

దీని పేరుతో ప్రభుత్వం ప్రజాధనం వృధా చేస్తుంది.ఇంటింటికీ నల్ల నీరు ఉత్తమాటే అన్నారు.

మిషన్ భగీరథ గ్రిడ్ డిఈ అభినయ్ వివరణ కోరగా అన్ని వాటర్ ట్యాంకులకు నీరు అందుతూనే ఉంది.శూన్యం పహాడ్ వద్ద బూస్టర్ పంపు కూడా ఏర్పాటు చేశాము.

గణేష్ పహాడ్ కి నీరు అందించేందుకు ట్రాన్స్ఫార్మర్ నుండి కలెక్షన్ కావాలి రైతుతో మాట్లాడుతున్నాము.మిషన్ భగీరథ ఇంటర్ డిఈ వెంకట్ రెడ్డిని వివరణ కోరగా మిషన్ భగీరథ కలెక్షన్లు పూర్తిచేసి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు హ్యాండోవర్ చేసాము.

మిషన్ భగీరథలో రెండు విధాలుగా ఉంటుంది.గ్రిడ్ వాళ్ళ పైపు ద్వారా నీళ్లు ట్యాంక్ లోకి వస్తే నల్లాలకు నీళ్లు వెళ్లిపోతాయి.

మేము కలెక్షన్ చేసి విలేజ్ లెవల్లో డిస్ట్రిబ్యూషన్ కి నెట్వర్క్ చేస్తాము.విలేజ్ లెవల్లో వాటర్ రావడం లేదంటే గ్రామాల నుండి ఫీడ్ బ్యాక్ గ్రిడ్ వాళ్లకే వెళ్ళిపోతుంది.

Latest Suryapet News