మిర్యాలగూడ మున్సిపల్ ముసలానికి తెరపడేదెప్పుడు...?

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్ల,పిఎసిఎస్ డైరెక్టర్ల (Municipal Chairman, Councillors, PACS Directors)రాజీనామాలపై సందిగ్ధత కొనసాగుతుంది.

బీఆర్ఎస్ (BRS)పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, పలువురు కౌన్సిలర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ (Congress)రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ (Deepa Das Munshi)సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా,ఆ చేరికలను డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో సహా స్థానిక కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించడం,పార్టీ అధిష్ఠానం కూడా చేరికలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

అయితే అప్పటి నుండి మున్సిపల్ చైర్మన్ వర్గం పరిస్థితి ఏమిటనే చర్చ కొనసాగుతూనే ఉంది.ఇదిలా ఉంటే ఈ రాజీనామాలు మున్సిపల్ నిబంధనల ప్రకారం జరుగయా లేదా?ఈ రాజీనామాలు తాత్కాలికమా? శాశ్వతమా? లేక అదంతా ఎన్నికల స్టంట్ మాత్రమేనాఅని కొందరు కౌన్సిలర్లు విమర్శలు చేశారు.రాజీనామాలు చేసిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్,పిఎసిఎస్ డైరెక్టర్లు రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్ కి లేదా రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (స్పెషల్ ఆఫీసర్) కు ఇవ్వాలి కానీ, దీపా దాస్ మున్షీకి,స్థానిక ఎమ్మేల్యేకు అందజేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఓ కట్టు కథ అని మరోవర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.ఏది ఏమైనా మున్సిపల్ లో జరుగుతున్న ముసలంలో అసలు వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ముదిరెడ్డి నర్సిరెడ్డి,బాలు,బండి యాదగిరిరెడ్డి,శేఖర్ రెడ్డి, రామకృష్ణ,మహిళా, మైనార్టీ కౌన్సిలర్లలో రెండు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు.వారందరూ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులపై ఎప్పుడైనా వచ్చి పాలకవర్గంలోని సీట్లలో కూర్చోవాలని ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

కానీ,స్థానిక ఎమ్మెల్యేతో పొసగని వారు కొత్తగా పార్టీలోకి వచ్చి ఆయనతో కలిసిమెలసి వుంటారా లేక ఎవరికి వారు యమునా తిరే అనే రీతిలో వుంటారా? అనేది ప్రశ్నార్ధకంగా మారడంతో ఈ ఎపిసోడ్ కి తెరపడేది ఎప్పుడో చూడాలి మరి.

చైనాలో దారుణం : టాయిలెట్‌లో చిన్నారిని బంధించిన ఇద్దరు మహిళలు..
Advertisement

Latest Nalgonda News