అంజన్న ఫొటో ఎంపికలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇక అంతే?

ప్రతీ ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టడం సహజమే.హిందువులందరి ఇళ్లల్లో కచ్చితంగా దేవుడి పటాలు లేదా విగ్రహాలు కచ్చితంగా మనకు కనిపిస్తాయి.

 What Problems Facing Have Anjaney Swamy Pictures In Home Details, Anjaneya Swamy-TeluguStop.com

అయితే అందరి దేవుళ్లతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాలు, చిత్రాలను కూడా మనం ఇంట్లో పెట్టుకుంటాం.కానీ హనుమంతుడి ప్రతిమ ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

లేకపోతే ఇంటికే అరిష్టమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిమ ఎంపికలో ఏ చిన్న పొరపాటు జరిగినా కుటుంబ సభ్యులంతా ఇబ్బందులు పడతారట.

అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంజనేయ స్వామి ఛాతీ చీలుస్తూ.

గుండెల్లో సీతారాముల ప్రతిమను చూపించే విధంగా ఉన్న ఫొటోలను ఇంట్లో అస్సలే పెట్టకూడదట.అలాంటి చిత్రం ఇంట్లో పెడితే అరిష్టమని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే హనుమంతుడి భుజాలపై రామ లక్ష్మణులు కూర్చున్న చిత్ర పటాన్ని కూడా ఇంట్లోని పూజా మందిరంలో ఉంచకూడదట.ఆంజనేయ స్వామి లంకా దహనం చేస్తున్న ఫొటోను ఇంట్లో పెడితే.

ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుందట.

అందుకే పొరపాటున కూడా అలాంటి ఫొటోను ఇంట్లో ఉంచకూడదట.పవన పుత్ర రూపంలో హనుమంతుడు గాల్లో ఎగురుతున్న చిత్ర పటాన్ని కూడా ఇంట్లో పెట్టకపోవడం మంచిదట.ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల జీవితాల్లో నిరంతరం హెచ్చు తగ్గులు ఏర్పడతాయంట.

ఇంట్లోని పూజా మందిరంలో దేవుళ్లు నవ్వుతూ.సున్నితంగా ఉండే చిత్ర పటాలను ఉంచితే చాలా మంచిదట.

అందుకే ఇంట్లోకి దేవుడి ఫొటోలను కొనుగోలు చేసేముందు ఒకసారి చూస్కొని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

What Problems Facing Have Anjaney Swamy Pictures In Home - Telugu Anjaneya Swamy, Anjanna, Devotional, Hanuman

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube