ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ఏం ప్లాన్ వేసిందంటే .. ? 

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ( BJP )అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

  ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 11 స్థానాల్లో పోటీ చేయగా,  కేవలం ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ఈ ఓటమికి గల కారణాలు ఏమిటి అనేది ఆ పార్టీ విశ్లేషించుకుంటుంది.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తరహా ఫలితాలు రాకుండా వీలైనంత ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఈ మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఇప్పటినుంచి ఎన్నికలు ముగిసే వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని తెలంగాణ బిజెపి నేతలు( Telangana BJP ) నిర్ణయించుకున్నారు .

ఈ మేరకు రెండు రోజుల క్రితం పార్టీ ఆఫీసులో సీనియర్ నేతలు , కార్యవర్గ సభ్యులంతా సమావేశమై చర్చించారు.వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు .ఈ మేరకు కేంద్రమంత్రి,  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రచారం కోసం కమిటీలను కూడా వేయాలని నిర్ణయించుకున్నారు.సీనియర్ నేతల ఆధ్వర్యంలో బస్సు యాత్రలు ప్రతి నియోజకవర్గంలోనూ, సీనియర్ నేతలతో కమిటీలు వేసి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలోను ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు .2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ , నిజామాబాద్,  కరీంనగర్ ,

Advertisement

సికింద్రాబాద్ స్థానాల్లో బిజెపి) BJP ) గెలిచింది అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాద్,  నిజామాబాద్,  కరీంనగర్ ఎంపీలు పోటీ చేసి ఓటమి చెందారు.అయితే గతంలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలవగా ఇప్పుడు ఎనిమిది గెలుచుకుంది.మరో 19 నియోజకవర్గాల్లో బిజెపి రెండో స్థానంలో నిలిచింది.

వీటన్నిటిని లెక్కలు వేసుకుంటున్న బిజెపి వీలైనంత ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు టార్గెట్ ను పెట్టుకుంది.జనవరి 15 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది .నెలరోజుల పాటు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించుకుంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు