తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రఘురాం రాజన్ వెళ్లారు.
ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్ర అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కీలక సూచనలు చేయడంతో పాటు తన అనుభవాలను రేవంత్ రెడ్డితో రఘురాం రాజన్ పంచుకున్నారు.
కాగా రఘురాం రాజన్ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా పని చేశారన్న సంగతి తెలిసిందే.అయితే ఈ భేటీలో ఇరువురితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.