సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ..!
TeluguStop.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు.
ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రఘురాం రాజన్ వెళ్లారు.
ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్ర అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కీలక సూచనలు చేయడంతో పాటు తన అనుభవాలను రేవంత్ రెడ్డితో రఘురాం రాజన్ పంచుకున్నారు.
కాగా రఘురాం రాజన్ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా పని చేశారన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ భేటీలో ఇరువురితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. బాలయ్య ఫ్యాన్స్ కు ఆరోజే పండగంటూ?