సంఘ భవనం ఏమైంది?వెంకటాపూర్ మాలల సంఘం ఆవేదన

దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వలేదు ఓట్లు వస్తేనే మేము గుర్తుకు వస్తున్నాము వెంకటాపూర్ మాలల సంఘం ఆవేదన రాజన్న సిరిసిల్ల జిల్లా :సంఘ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానంటిరి ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని మాలల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దళిత కమ్యూనిటీ సభ్యులందరు కలిసి శుక్రవారం మీటింగు ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా మాలలము గుర్తుకు వస్తున్నామని అన్నారు.దళిత బంధు ప్రవేశపెట్టిన మా మాలలకు ఒక్కరికి కూడా పథకం అందలేదనివాపోయారు.

What Happened To The Sangha Building , Sangha Building-సంఘ భవనం �

మండల ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నప్పటికీ మా గోడు ఎవ్వరు వినలేదని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Latest Rajanna Sircilla News