నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేక వింక్ గర్ల్ ఏం చేసిందంటే?

వింక్ గర్ల్ అంటే ఎవరో గుర్తొచ్చిందా? గుర్తొచ్చే ఉంటుంది లెండి.వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్‌.

ఆమె ఫాలోయింగ్ మాములు ఫాలోయింగ్ ఆ ఏంటి? అప్పట్లో ఓవర్ నైట్ స్టార్ అన్నట్టు ఒక్కసారి అలా కన్నుకొట్టిందో లేదో అందరూ ఆమెకు ఫిదా అయిపోయారు.ఒక్క రాత్రిలో ఆమెకు కొన్ని కోట్లమంది ఫాలోవర్స్ వచ్చేశారు.

ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కూడా వెనక్కి పడ్డాడు.అంత అందంగా ఉంది ఆ వీడియో.ఇక వీడియోతో ఫ్యాన్స్ మనసు దోచిన ఈ పాప ఆ సినిమాలో హీరోయిన్ కాదు.

హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్.ఇక ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వలేదు.

Advertisement

ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు.అలాంటి సినిమా అది.ఆ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ శ్రీదేవి బంగ్లా అంటూ నటించింది.అది కాస్త వివాదానికి దారి తీసింది.

అందులో ఉన్న కొన్ని సన్నివేశాలు దివంగత నటి శ్రీదేవికి సంబంధించినవి కావడంతో వివాదానికి గురైంది.అది ఇప్పటికి విడుదల అవ్వలేదు.

ఇక ఇప్పుడు అయ్యేది కాదు అని గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ బ్యూటీ.తాజాగా భారీస్థాయిలో అందాల ఆరబోత చేస్తూ ఓ ఫోటో షూట్ చేసింది.

ఆ ఫోటో షూట్ చూసిన నెటిజన్లు అంత వామ్మో అంటూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అంటే నమ్మండి.కొందరు సూపర్ అంటూ ఆమెను పొగిడితే మరికొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఆ క్షణాలు నాకు ఎప్పటికీ పదిలం.. హీరో నాగచైతన్య క్రేజీ కామెంట్స్ వైరల్!

కొందరు అయితే ఏకంగా అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆ కామెంట్లపై స్పందించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఫైర్ అయ్యింది.

Advertisement

కొందరు చేసిన కామెంట్లను ఆమె స్టోరీస్‌లో పోస్ట్ చేసి ఇలా చెప్పుకొచ్చారు.ఇవి నా ఫొటోలకు వచ్చిన కొన్ని కామెంట్లు.

ఇందులో కొన్ని కూడా చూడలేకపోయాను.కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటివి ఎదుర్కొంటున్నా.

అవన్నీ దాటుకుంటూ ఈ స్థానానికి వచ్చాను.ఏది ఏమైనా అందరి పట్ల దయతో గౌరవంగా ప్రవర్తించాలని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాబట్టే ఎవరిని ఏమి అనకుండా.

బెదిరింపులు ఎదుర్కొంటూనే ఇంత దూరం వచ్చా.నన్ను చూసి నేను గర్విస్తున్నాను.

ప్రతి స్త్రీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్న అంటూ ప్రియా ప్రకాష్ చెప్పగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

తాజా వార్తలు