ఓటు మన జన్మ హక్కు: జిల్లా జడ్జి జి.రాజగోపాల్

సూర్యాపేట జిల్లా: యువత దేశ భవిష్యత్ అని, అర్హులైన యువత ఓటరుగా నమోదు కావాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లడుతూ 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుకు గుర్తుగా జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.యువత చేతిలో దేశ భవిష్యత్ ఉందని, అర్హులైన యువత ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.

ఓటు ఒక వజ్రాయుధమని,ఓటు ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.ఓటు వేయడం మన ప్రధమ హక్కుగా భావించాలని, ఎన్నికల్లో ఓటు ద్వారా నిజాయతీ,నిబద్దత గల మంచి నాయకుడిని ఎన్నుకోవడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.2023లో జరిగిన శాసనసభా ఎన్నికల్లో యువత ఓటరుగా నమోదుతో ఓటింగ్ శాతం మరింత పెరిగిందని అన్నారు.జిల్లాలో గత శాసన సభాఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంతో జిల్లాకు అవార్డు రావడంతో జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సిహెచ్.ప్రియాంక, ఏ.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత శాసన సభా ఎన్నికల నేపథ్యంలో యువత ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని, పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.తదుపరి జిల్లా జడ్జి యువతకు ఎపిక్ కార్డులు,వృద్ధులకు శాలువాలతో సన్మానం అలాగే ముగ్గులు,కబడ్డీ పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంశ పాత్రలు అందచేశారు.

Advertisement

అంతకు ముందు ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబేడతామని,మతం, జాతి,కులం,వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.

అధికారులకు 11కెవి విద్యుత్ స్తంభం కనిపించడం లేదా...?
Advertisement

Latest Suryapet News