Vishaka: హాట్ సీటుగా విశాఖ పార్లమెంట్ స్థానం..!!

ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు విశాఖ పార్లమెంట్ స్థానం హాట్ సీటుగా మారింది.

రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు.

విశాఖ ఎంపీ స్థానం గెలుపొందడం పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య ఎక్కువ పోటీ నెలకొంది.

దాంతో పాటు ఇతర పార్టీలకు చెందిన మరి కొంతమంది నేతలు సైతం విశాఖ స్థానం నుంచి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.కాగా వైసీపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని ప్రకటించింది.

గతంలో బొబ్బిలి ఎంపీగా ఝాన్సీ పని చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరితే విశాఖ ఎంపీ సీటు బీజేపీకే అని ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement

ఈ నేపథ్యంలో విశాఖ నుంచి పురంధేశ్వరి బరిలో దిగే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది.అలాగే ఈ స్థానం నుంచి బీజేపీకి చెందిన మరో నేత జీవీఎల్ నరసింహరావు కూడా బరిలో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అలాగే విశాఖ ఎంపీ సీటుపై సీఎం రమేశ్ సైతం ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.అలాగే విశాఖ సీటుపై ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏ పాల్ దృష్టి సారించగా జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని తెలుస్తుండగా.

కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని యోచిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ స్థానం హాట్ సీటుగా మారింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు