వైరల్ వీడియో: 40 సెకండ్లలో అన్ని పుష్ అప్స్ చేసి ఆశ్చర్యపరిచిన జవాన్..!

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా చేసిన ఒక వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఈ వీడియోలో ఒక జవాన్ మంచు కురుస్తున్న ప్రాంతంలో 40 సెకండ్లలో 47 పుష్ అప్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.

బాగా మంచు పేరుకుపోయిన ఒక ప్రాంతంలో అతడు పుషప్స్ తీస్తూ ఆశ్చర్యపరిచాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరో వీడియో లో ఒక జవాను ఒంటిచేత్తో పుషప్స్ చేస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.వైరల్ అవుతున్న వీడియోలో మనం బాగా మంచు పేరుకుపోయిన ఒక ప్రాంతంలో పుష్ అప్స్ చేసేందుకు రెడీ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ ని చూడొచ్చు.

ఆ తర్వాత అతను 40 సెకండ్లలో 47 పుష్ అప్స్ చేయడం గమనించవచ్చు.సాధారణంగా మంచులో శరీరంలో వేడి పుట్టించేందుకు జవాన్లు వ్యాయామం చేస్తుంటారు.

Advertisement
Viral Video Surprised Jawan Who Did All The Push Ups In 40 Seconds , 40 Secon

అయితే మంచులో వేగంగా వ్యాయామం చేయాలంటే అద్భుతమైన ఫిట్నెస్ కావాల్సి ఉంటుంది.అలాగే ఆపకుండా సెకన్ల వ్యవధిలో రెట్టింపు స్థాయిలో పుష్ అప్స్ చేయాలంటే మరింత స్టామినా అవసరమవుతుంది.

అయితే వీడియోలో కనిపిస్తున్న ఒక ఆర్మీ జవాను మాత్రం సునాయాసంగా పుషప్ చేస్తూ అందరికీ ఫిట్నెస్ గోల్స్ పెంచుతున్నారు.

Viral Video Surprised Jawan Who Did All The Push Ups In 40 Seconds , 40 Secon

బీఎస్ఎఫ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.40 సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.గడ్డకట్టే మంచులో కాపలా కాస్తున్న ఈ జవానుకు సెల్యూట్ చేస్తున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ పుష్ అప్స్ చేసిన జవాన్ ఫిట్నెస్ ని తెగ పొగిడేస్తున్నారు.భారత జవాన్ల చూసి మేం గర్విస్తున్నానని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఇంకొక వీడియోని కూడా బీఎస్ఎఫ్ షేర్ చేసింది.ఇందులో ఒక జవాన్ ఒంటిచేత్తో పుష్ అప్స్ చేస్తూ ఆశ్చర్యపరిచారు.

Advertisement

తాజా వార్తలు