వైరల్: పావురాలపై గుర్రం చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు!

Viral Netizens Are Getting Fed Up With The Love Shown By The Horse To The Pigeons, Bird, Horse, Love, Viral Latest, News Viral, Social Media, Viral Video, Latest News

పావురాలపైన గుర్రం( horse ) ప్రేమ ఏమిటి? అని అనుమానం కలుగుతుంది కదూ.మానవత్వం మనుషుల్లోనే కాదండోయ్… అప్పుడప్పుడు జంతువులలో కూడా పరిఢవిల్లుతుంది.

 Viral Netizens Are Getting Fed Up With The Love Shown By The Horse To The Pigeon-TeluguStop.com

అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకే ఆ విషయం బోధ పడుతుంది.నోరులేని జంతువులు కూడా తోటి మూగజీవాల పట్ల ప్రేమ, సాయం చేసే గుణాన్ని చూపిస్తుంటాయి.

ఈ మధ్య కాలంలో ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని మీరు గమనించే వుంటారు.తాజాగా అదే కోవకు చెందిన వీడియో ఒకటి నెటిజన్ల మనసులను దోచేస్తోంది చూడండి ఇక్కడ.

వైరల్‌ అవుతోన్న వీడియోని ఒకసారి గమనిస్తే… రోడ్డుపైన పయనిస్తున్న ఓ గుర్రం ఒక్కసారి ఆగి పావురాలపై ప్రేమను కురిపిస్తున్న తీరుని గమనించవచ్చు.గుర్రానికి యజమాని పెట్టిన దానాన్ని తింటూ ఉండగా అక్కడికి ఒక పావురాల గుంపు వచ్చి చేరుతుంది.దాంతో ఆ గుర్రం వాటి ఆకలిని గుర్తించి ఆ దానాన్ని వాటికి దాణాగా వేయడం గమనించవచ్చు.దాంతో గుర్రం ఏమంటుందో అని భయపడుతూనే అక్కడ పడిన గింజలను తింటూ వున్నాయి పావురాలు.

సాధారణంగా గుర్రం ప్లేసులో వేరే జంతువుకానీ, పక్షులు కానీ ఉంటే తాము తింటున్న ఆహారం వైపు ఇతర పక్షులు వస్తే వాటిని అరిచి తరిమేస్తాయి.కానీ ఈ గుర్రం అలా చేయలేదు.

అందుకే ఈ వీడియో ఇపుడు చాలా ప్రత్యేకంగా నిలిచింది.గుర్రం తాను తినడమే కాక ఆ పావురాలకు కూడా తన ఆహారాన్ని పెట్టడంతో ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ది ఫిజిన్( The Fijian ) అనే ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ కాబడ్డ ఈ వీడియో జనాల మనసులను మెప్పిస్తోంది.ఈ వీడియోను ఇప్పటి వరకు 2.9 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించగా 68 వేల మందికి పైగా లైక్ చేయడం విశేషం.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.‘మనుషులకంటే జంతువులే బెటర్‌’ అని కొంతమంది కామెంట్ చేస్తే… ‘పిల్లికి కూడా బిచ్చం పెట్టని జీవుల్లారా.ఈ గుర్రాన్ని చూసి నేర్చుకోండి’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube