చంద్రబాబు కు కడుపు మంట పెరిగింది అంటున్న విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి.

రోజూ అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఒకరినొకరు మీడియా ముందు విమర్శించుకుంటూ తమదైన ఎంటర్ టైన్ మెంట్ ను ప్రజలకు కరోనా టైంలో కూడా అందిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఇరువర్గాల మధ్య విమర్శలు పతాక స్థాయికి చేరాయి.దీనితో ప్రస్తుతం ఇరు వర్గాలు ఒకరిమీద ఒకరు చేసుకుంటున్న విమర్శలలో నాణ్యత లోపించి వ్యక్తిత్వంపై దూషణ చేసుకునే స్థాయికి చేరింది.

Vijay Sai Reddy Comments On CBN, YCP MP Vijaya Sai Reddy, AP Politics, Chandra B

ఇది ప్రజాస్వామ్యానికి తగదని విశ్లేషకులు ఇరువర్గాలను హెచ్చరిస్తున్నా వాటిని పట్టించుకోని వైసీపి,టీడీపి తాము చేసింది రైట్ అంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక తాజాగా వైసీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు పైన ఫైరయ్యారు.

మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.విజయసాయిరెడ్డి తాజాగా రాష్ట్రంలోని శ్రీశైలం,నాగార్జునసాగర్ మరియు ఇతర నీటి ప్రాజెక్ట్ లు జలకళతో కళకళలాడుతున్నాయి.

Advertisement

దీనితో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంగా ఉన్నారు.ఇది ఏ మాత్రం తట్టుకోలేని చంద్రబాబునాయుడు కడుపుమంటతో రగిలిపోతున్నారని వైసీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు