ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఒక వీడియో నెటిజన్లను ఎంతగానో కదిలిస్తుంది.ఇజ్రాయెల్, గాజా( Israel, Gaza ) మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలామంది చిన్న పిల్లలు కూడా గాయపడుతున్నారు ఎంతోమంది అనాధలవుతున్నారు.
ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్న వేళ ఒక చిన్న పాలస్తీనియన్ బాలిక( Palestinian girl ) తన సోదరిని మోస్తూ కనిపించింది.ఆ బాలిక తన సోదరిని భుజాలపై మోస్తూ గంటల తరబడి ప్రయాణించింది.
తన సోదరికి గాయాలైనందున, వైద్యం చేయించడానికి ఆమె ఇలా చేసింది.ఈ చిన్నారి ధైర్యం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజల సెల్యూట్ చేస్తున్నారు.
జీవించాలనే కోరిక ఎంత బలమైనదో ఈ వీడియో మనకు చూపిస్తోంది.
వైరల్ వీడియోను ఎక్స్‌లో “WearThePeace” అకౌంట్ షేర్ చేసింది.ఆ వీడియోలో, చిన్నారి బాలిక తన గాయపడిన సిస్టర్‌ను భుజం మీద వేసుకొని నడుస్తున్నట్లు చూడవచ్చు.చుట్టూ నాశనం అయిపోయి ఉంది.
ఆమె కాలికి చెప్పులు కూడా లేవు, చాలా అలసిపోయి ఉన్నట్లు కనిపిస్తోంది.ఒక వ్యక్తి ఆమెను చూసి చలించిపోయాడు.
ఎందుకు ఇలా తన చెల్లెలిని మోస్తున్నావు అని అడిగితే, ఆ బాలిక “మాకు కారు లేదు కాబట్టి” అని బాధగా చెప్పింది.తన చెల్లి కాలికి చికిత్స చేయించాలని కోరుకుంటుంది.
ఆ మనిషి ఆమెను కారులో తీసుకెళ్లడానికి అనుమతించాడు ఆమెకు కారులో అతను లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు.ఆసుపత్రికి సమీపంలో దింపిన తర్వాత ఆ ధైర్యవంతురాలు తన సిస్టర్ ను మళ్ళీ భుజం మీద వేసుకొని డాక్టర్ల వద్దకు తీసుకెళ్లడానికి బయలుదేరింది.
ఆ వీడియో చూసిన ప్రజలు చాలా భావోద్వేగానికి గురయ్యారు.కొంతమంది “ఇలాంటి వీడియోలు చూస్తే మనసు ఎంత బాధపడుతుందో!” అని కామెంట్ చేశారు.మరికొందరు “యుద్ధాలు, గొడవలు ఆపండి” అని కోరారు.మరొకరు “ఆమె పేరు తెలుసా? ఆమె కాలికి చెప్పులు లేకుండా ఉన్న దృశ్యం చూసి నా మనసు చిద్రమైపోయింది.ఏ పిల్లవాడికీ ఇలాంటి పరిస్థితులు ఎదురవకూడదు” అని రాశారు.మరికొందరు “చాలా హార్ట్ బ్రేకింగ్, హార్ట్ టచింగ్ గా ఉంది” అని అన్నారు.