ఎంపీపీలుగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఎంపీపీలు

నల్లగొండ జిల్లా: చండూరు వైస్ ఎంపీపీ అవ్వారి గీత, మర్రిగూడ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్ ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఎంపీపీలుగా బాధ్యతలను స్వీకరించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల అధికారులు వారికి బాధ్యతలను అప్పగించారు.

గత నెల 31న మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి పై,ఈనెల 1న చండూరు ఎంపీపీ పల్లే కళ్యాణిపై ఎంపీటీసీల అవిశ్వాసం నెగ్గడంతో ఎంపీపీ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఇన్నిరోజులు ఖాళీగా ఉన్న ఎంపిపి స్థానాల్లో ఎట్టకేలకు బాధ్యతలను వైస్ ఎంపీపీలకు అప్పగించారు.

Vice MPPs Who Took Charge As MPPs, Vice MPPs , Nalgonda District, Avvari Geetha,
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News