సాధారణంగా మన టాలీవుడ్‌లో ఏదైనా దేశభక్తికి సంబంధించిన సినిమా వస్తుందంటే అందులో జవాన్ల సాహసాలే ఎక్కువగా కనిపిస్తాయి.ఎయిర్ ఫోర్స్, షిప్పులతో సినిమాలు తీయడం బాగా ఖర్చవుతుంది కాబట్టి వాటి జోలికి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు.
నిజానికి దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ ఒకటే కాదు ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పోరాడుతున్నాయి.ఇంకా మన భారత దేశాన్ని కాపాడే సంస్థలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఇప్పటిదాకా కేవలం ఆర్మీ సాహసాలు చూపించిన తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఒక కొత్త మార్పు వచ్చింది.అది కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) సినిమా రూపంలో! ఈ హీరో యాక్ట్ చేసిన “ఆపరేషన్ వాలెంటైన్” ( Operation Valentine )నేడు థియేటర్లలో రిలీజ్ అయింది.
డైరెక్టర్ శక్తి ప్రతాప్ తీసిన ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఇందులో పుల్వామా దాడికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో చూపించారు.
విభిన్నమైన, ఆసక్తికరమైన స్టోరీతో వరుణ్ తేజ్ ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడని చెప్పుకోవచ్చు.ఇందులో అతడు వింగ్ కమాండర్ గా( Wing Commander ) ఒక విభిన్నమైన పాత్ర పోషించాడు.ఇక మానుషీ చిల్లర్( Manushi Chillar ) రాడార్ ఆఫీసర్‌గా యాక్ట్ చేసింది.
తెలుగులో తొలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టోరీతో సినిమా చేసిన హీరోగా వరుణ్ తేజ్ నిలిచాడు.అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే మూవీ ఆడదేమో అని ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ, కొన్ని కెమిస్ట్రీ సీన్లను ఉంచారు కానీ ఆ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
అయితే సినిమా మొత్తం మీద పర్వాలేదు అనిపించిందని చాలామంది చూసినవారు కామెంట్లు చేస్తున్నారు.హిట్టు ఫ్లాపు అనే సంగతిని పక్కన పెడితే ఈ సినిమాతో వరుణ్ తేజ్ క్రేజ్ వేరే రేంజ్ కి వెళ్తుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.ఎందుకంటే అతను ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని తప్పకుండా అందిస్తుంది.ఇలాంటి మరెన్నో సినిమాలకు ఈ మూవీ నాంది అవుతుంది.ఈ మూవీతో మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు.
అక్కడ దేశభక్తి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి కాబట్టి వరుణ్ తేజ్ కి హిందీలో ఫ్యాన్ ఫాలోయింగ్ అవకాశం ఉంది.