చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్..ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ తో సినిమా ఎలా తీసాడు

మనం ఎంతో అభిమానించే వ్యక్తులతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా భావిస్తాం.ఎంతో సంతోషంగా, గర్వంగా కూడా ఫీలవుతాం.

వివి వినాయక్ కూడా ఇలాంటి అనుభూతే అందుకున్నాడు.తమ అభిమాన హీరోతో కలిసి సినిమాలు చేసి మంచి విజయాలను సాధించాడు.

ఇంతకీ ఆయన ఫేవరెట్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. వాస్తవానికి చిరంజీవి గొప్ప నటుడు.

ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ దర్శకులు అంతా ఎదురు చూస్తారు కూడా.అయితే వినాయక్ చాలా స్పెషల్.

Advertisement

చిన్నతనం నుంచి చిరంజీవి వినాయక్ వీరాభిమాని.అప్పట్లో చిరంజీవి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఆయన చేసే హంగామా మామూలుగా ఉండేది కాదు.

చాలా కాలం తన సొంతూరు అయిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వొరు సమీపంలోని చాగల్లులో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నాడు కూడా.వివి వినాయక్ కుటుంబానికి సొంతగా థియేటర్ ఉండేది.

రాజమండ్రిలో కూడా కొన్ని థియేటర్లను లీజుకు తీసుకుని నడిపించారు వినాయక్ తండ్రి.ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విడుదల సందర్భంగా తన ఊరిలో పండగ వాతావరణం కలిగేలా చేశారట వినాయక్.

భారీగా వానలు పడుతున్నా కార్లతో ర్యాలీగా చాగల్లు నుంచి రాజమండ్రికి వెళ్లి సినిమా చూసి వచ్చారట.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

కొంత కాలం తర్వాత వినాయక్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.తొలుత ఎన్టీఆర్ తో కలిసి ఆది సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.తన మూడో సినిమా ఠాగూర్ ను తన అభిమాన నటుడితో కలిసి చేశాడు.

Advertisement

ఈ సినిమా అప్పట్లో  బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లిన చిరంజీవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

ఆ తర్వాత రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయనతో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమా చేశాడు చిరంజీవి.ఈ సినిమా కూడా బాగానే ఆడింది.

మొత్తానికి తన అభిమాన హీరోతో సినిమాలు చేసి అదుర్స్ అనిపించాడు వినాయక్.

తాజా వార్తలు