భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : ఎర్రకోటకు రానున్న అమెరికా చట్టసభ సభ్యులు

భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు వూరూ వాడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Us Lawmakers To Participate In Red Fort Address Of Pm Modi On India's Independen-TeluguStop.com

ఇక ఆగ్రాలోని ఎర్రకోట వద్ద కనినీని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi )జాతీయ పతాకాన్ని ఎగురవేసి .దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ఈసారి భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా చట్టసభ సభ్యుల బృందం రానుంది.

ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

Telugu Michael Waltz, Pm Modi, Primenarendra, Congressmanro, Lawmakers-Telugu NR

ద్వైపాక్షిక కాంగ్రెస్ ప్రతినిధి బృందం భారత్‌కు రానుంది.ఈ బృందానికి భారత సంతతి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( US Congressman Ro Khanna ), మరో కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ వాల్ట్జ్ ( Michael Waltz )నాయకత్వం వహిస్తున్నారు.వీరిద్దరూ భారత్ , భారతీయ అమెరికన్లపై ద్వైపాక్షిక కాంగ్రెషనల్ కాకస్‌కు కో చైర్‌లుగా వ్యవహరిస్తున్నారు.

దీనిపై రో ఖన్నా పీటీఐతో మాట్లాడుతూ.భారతదేశంలో పర్యటించనున్న ద్వైపాక్షిక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం తనకు దక్కిన గౌరవమన్నారు.

భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు.

Telugu Michael Waltz, Pm Modi, Primenarendra, Congressmanro, Lawmakers-Telugu NR

తన తాతయ్య భారతదేశ స్వాతంత్య్రం ( Independence of India )కోసం తన జీవితాన్ని అంకితం చేశారని రో ఖన్నా గుర్తుచేసుకున్నారు.భారత్- అమెరికా బంధానికి ఇది చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు.ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, కేబినెట్ మంత్రులు, వ్యాపార, సాంకేతిక, క్రికెట్, బాలీవుడ్ నటీనటులను కలవాలని తాము భావిస్తున్నట్లు ఖన్నా చెప్పారు.

ఈ పర్యటన మన దేశాల మధ్య సమన్వయం , భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేస్తుందన్నారు.డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, ఆర్ధిక భాగస్వామ్యం, రక్షణ సంబంధాలు, మానవ హక్కులు వంటి ముఖ్యమైన అంశాలపై నిమగ్నమవ్వడానికి అనుమతిస్తుందని రో ఖన్నా తెలిపారు.

అదే రోజున జాతిపిత మహాత్మా గాంధీ స్మారక స్థలి రాజ్‌ఘాట్‌ను వారు సందర్శించనున్నారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందంలో రో ఖన్నా, వాల్డ్జ్‌, రిచ్ మెక్ కార్మిక్, ఎడ్ కేస్‌, డెబోరా రాస్, క్యాట్ కమ్మక్, శ్రీ తానేదార్, జాస్మిన్ క్రోకెట్‌లు వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube