దేవుడా.. ఆమె కంట్లో 27 కాంటాక్ట్ లెన్స్.. ఎలా వచ్చాయంటే ?

చాలా మంది కాళ్ళ జోడు అంటే ఇష్టపడరు.అలాంటి వారు కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉంటారు.

ఒక మహిళా కూడా కాంటాక్ట్ లెన్స్ వాడుతుంది.అదే ఆమె కొంప ముంచింది.

గత 35 సంవత్సరాలుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతుంది.ఆమె అజాగ్రత్త కారణంగా హాస్పిటల్ పాలు అవ్వాల్సి వచ్చింది.

డాక్టర్లు చెక్ చేసి ఆమె కంట్లో 27 కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు చాలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్స్ చెబుతున్నారు.

Advertisement
UK Surgeon Finds 27 Missing Contact Lenses In Woman’s Eye, Contact Lenses Stuc

ఎందుకంటే కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు దుమ్ము, ధూళి లాంటివి కంటి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి.ఇలా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం.

అంతేకాదు వాటిని పడుకునే ముందు అస్సలు ఉంచుకోకూడదు.వాటిని తీసిన తర్వాతే నిద్రపోవాలి.

ఇలా జాగ్రత్తలు తీసుకోకపోతే కన్ను కు ఇన్ఫెక్షన్ సోకుతుంది.

Uk Surgeon Finds 27 Missing Contact Lenses In Woman’s Eye, Contact Lenses Stuc

ఇది చాలా ప్రమాదం.ఇలాంటి జాగ్రత్తలు ఏమి ఈ మహిళా పాటించక పోవడంతో ఆమె హాస్పిటల్ పాలు అవ్వాల్సి వచ్చింది.67 సంవత్సరాలు ఉన్న ఆమె యుకె కు చెందిన మహిళా.ఆమె గత 35 సంవత్సరాలుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

గత కొద్దీ రోజులుగా కళ్ళు దురద పెడుతున్నాయని, కళ్ళు పొడి బారిపోతున్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Uk Surgeon Finds 27 Missing Contact Lenses In Woman’s Eye, Contact Lenses Stuc
Advertisement

డాక్టర్స్ ఆమె కంటిని పరీక్షించగా ఆమె కంటి లోపలి భాగంలో కాంటాక్ట్ లెన్స్ పేరుకుపోయి కనిపించాయి.డాక్టర్స్ వాటిని జాగ్రత్తగా తీయగా మొత్తం 27 కాంటాక్ట్ లెన్స్ బయట పడ్డాయి.దీంతో ఆ మహిళ షాక్ అయింది.

ఆమె కాంటాక్ట్ లెన్స్ కనిపించకపోతే పోయాయి అనుకుని వేరేవి పెట్టుకోవడం వల్ల అవి కంటి లోపలి భాగానికి చేరిపోయాయి.ఆమె నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని డాక్టర్స్ చెబుతున్నారు.

అందుకే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని కూడా వైద్యులు చెబుతున్నారు.

తాజా వార్తలు