రిటైల్ దుకాణం నుంచి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన దుస్తులను దొంగిలించడానికి కుట్ర పన్నినందుకు ఇద్దరు భారతీయ పౌరులు సింగపూర్‌లో జైలు( Jail in Singapore ) పాలయ్యారు.
అదే నేరానికి గాను నలుగురు సింగపూర్ జాతీయులకు జైలు శిక్ష విధించిన రోజుల తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.నిందితులు 27 ఏళ్ల బ్రహ్మభట్ కోమల్ చేతన్ కుమార్, క్రిస్టియన్ అర్పితా అరవింద్‌భాయ్‌లు( Brahmabhat Komal Chetan Kumar , Christian Arpita Aravindbhai ) దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం లేదని తొలుత బుకాయించారు.
కానీ ఆ తర్వాత వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు.దీంతో వారికి వరుసగా 40, 45 రోజుల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

కోమల్, అర్పితలు సింగపూర్‌లో స్టూడెంట్ పాస్‌లపై మరో నలుగురు భారతీయులతో కలిసి నివసిస్తున్నారు.ఈ గ్యాంగ్ మరికొందరితో కలిసి రిటైల్ షాపుల్లో దుస్తులు దొంగిలించడానికి కుట్ర పన్నింది.ఇందులో మరో ముగ్గురు భారతీయులు కూడా భాగం పంచుకున్నారు.ఈ గ్యాంగ్‌లోని నలుగురికి ఇదే నేరంపై నవంబర్ 22న 40 నుంచి 65 రోజుల జైలు శిక్ష విధించింది కోర్ట్.
అక్టోబర్‌లో ఈ గ్యాంగ్ ఓ దుకాణానికి వెళ్లి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్( Radio frequency identification ) (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను తీసేసింది.సెక్యూరిటీ అలారం మోగకుండా దొంగతనం చేయాలన్నది వీరి కుట్ర.
అనంతరం సెల్ఫ్ చెక్ అవుట్ ప్రాంతంలో టోట్ బ్యాగులను కొనుగోలు చేసి , తమ వస్తువులన్నింటికీ డబ్బు చెల్లించినట్లు నటిస్తూ బ్యాగ్‌లను నింపేసింది.అలా మొత్తం 1,788 సింగపూర్ డాలర్ల విలువైన 64 దుస్తులను వారు దొంగిలించారు.

నివేదిక ప్రకారం.గ్యాంగ్‌లోని కొంతమంది సభ్యులు మరికొందరితో కలిసి అదే ఔట్‌లెట్‌లో మరోసారి దొంగతనం చేయాలని కుట్రపన్నింది.ఈ క్రమంలో ఓ రోజున 2,271 సింగపూర్ డాలర్ల విలువైన దుస్తులను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు.సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని , అభియోగాలను మోపారు.