ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఇద్దరు ఎమ్మెల్యేల భేటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు( Andhra Pradesh Politics ) రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.

2019 ఎన్నికల కంటే ఈసారి చాలా క్లిష్టంగా ఉన్నాయి.ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

Two YSRCP MLAs Meet With AP CM YS Jagan, YSRCP MLAs, AP CM YS Jagan,AP Polittics

ఏపీ ప్రజల ఓటర్ నాడీ ఎవరు కనిపెట్టలేక పోతున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్( YS Jagan ) తన పార్టీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఏమాత్రం వ్యతిరేకత ఉన్న పక్కన పెట్టేస్తున్నారు.

Advertisement

పోటీకి దింపే అభ్యర్థుల విషయంలో పక్కా వ్యూహాలతో సర్వేలు చేయించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇక మార్పులు చేర్పులు, స్థాన చలనం చేయాల్సి వస్తే సదరు నాయకులతో జగన్ ముందుగానే మాట్లాడుతున్నారు.

ఇప్పటికే వైసీపీ మార్పుల చేర్పులకి సంబంధించి రెండు లిస్ట్ లు విడుదలయ్యాయి.అతి త్వరలో మూడో లిస్ట్ కూడా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ తో పెనమలూరు, పామర్రు ఇన్చార్జిల మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు పార్థసారథి, అనిల్ ను ముఖ్యమంత్రి వద్దకు రీజినల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ తీసుకెళ్లడం జరిగింది.

బీసీ వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, తగిన గౌరవం దక్కలేదని పార్థసారథి కొన్ని రోజుల క్రితం బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితులలో సీఎం జగన్ తో భేటీ కావడం సంచలనంగా మారింది.

తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?
Advertisement

తాజా వార్తలు