ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉన్న టీడీపీ( TDP ) పరిస్థితి రోజురోజుకు మరింత ఆగమ్య గోచరంగా తయారవుతుందని తెలుస్తోంది.వైసీపీ( YCP ) పాలనను చూసిన ప్రజలు టీడీపీపై పూర్తిగా విరక్తితో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దానికి తోడు ఇటీవలే ఆ పార్టీ అధినేత స్కాంలో జైలుకు వెళ్లడంతో టీడీపీ ఉన్న కాస్త ఆదరణను కూడా కోల్పోయిందని తెలుస్తోంది.అయితే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలే కాకుండా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీకి పార్టీ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారిందని అర్థం అవుతోంది.పార్టీ బహిర్గతంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.కనీసం అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి పార్టీ అధిష్టానం చేరుకుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం తలోదారిలో ఉన్నారు.
ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని( Vijayawada MP Kesineni Nani ) పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక ఉన్న ఇద్దరిలో ఎంపీ గల్లా జయదేవ్ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అంతేకాకుండా ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారని సమాచారం.మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు.ఈయన కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవాలని యోచనలో ఉన్నారు.దీంతో ఎంపీ పదవి పోటీ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.
సిట్టింగ్ ఎంపీలే ఈ విధంగా పోటీకి దూరం కాగా.పార్టీలో చెప్పుకోదగిన నేతలు ఎవరూ లేరని, ఒకవేళ ఒకరిద్దరూ ఉన్నా పోటీకి ఆసక్తి చూపించడం లేదట.పార్టీ పరిస్థితే రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉంటే ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు( Chandrababu Naidu ) టార్గెట్లు కూడా పెడుతున్నారట.టీడీపీ నాయకులు పోటీ చేయకుండా ఉండేందుకు ఇది కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది.
అయితే రాయలసీమలో శివప్రసాద్ మరణంతో తిరుపతి స్థానం నుంచి పోటీలో నిలిచేందుకు సరైన అభ్యర్థి ఇప్పటివరకు దొరకలేదంటే అర్థం చేసుకోవచ్చు.టీడీపీ పరిస్థితి ఏంటనేది.
అంతేకాదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కరువయ్యారు.ఇక కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు.
కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం.నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు.
బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే.కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు.
ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు.
టీడీపీలో ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పక్క పార్టీల్లో నేతలు ఎవరైనా అటు వస్తారేమోనని చంద్రబాబు ఎదురు చూస్తున్నారట.
ఎంపీ స్థానాలకే పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పరిస్థితి ఏంటోనని ప్రతి ఒక్కరి మదిలో మెదలాడుతున్న ప్రశ్న.గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఏం చేయని టీడీపీ ఇప్పుడు వచ్చినా ఏం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సరైన నేతలే లేని పార్టీ ప్రజలకు ఏం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.