చర్మం ఎల్ల‌ప్పుడూ నిగనిగలాడాలంటే వారానికోసారి ఇలా చేయండి!

చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగ‌నిగ‌లాడాల‌ని ఎవ‌రూ కోరుకోరు చెప్పండి.స్త్రీలే కాదు పురుషులు కూడా అదే కోరుకుంటారు.

కానీ, ప్ర‌స్తుత టెక్నాల‌జీ యుగంలో బిజీ లైఫ్ స్టైల్‌, కాలుష్యం, ఒత్తిడి, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే చ‌ర్మ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం, రెగ్యుల‌ర్‌గా మేక‌ప్ వేసుకోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.దాంతో నిగ‌నిగ‌లాడాల్సిన చ‌ర్మం డ‌ల్‌గా, కాంతహీనంగా క‌నిపిస్తుంది.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని వారానికి ఒక‌సారి ట్రై చేస్తే చ‌ర్మం ఎప్పుడూ అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా నిగ‌నిగ‌లాడుతూ క‌నిపించ‌డం ఖాయం.మ‌రి ఇంకేంటి లేటు ఈ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిప‌ప్పు, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే మిక్సీ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న ఎర్ర కందిప‌ప్పు, రెండు ట‌మాటో స్లైసెస్‌, మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
Try This Home Remedy Once A Week For Glowing Skin Forever! Home Remedy, Glowing

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్క‌లు నిమ్మ ర‌సం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు, కావాలి అనుకుంటే చేతుల‌కు కూడా అప్లై చేసుకుని ఓ అర గంట పాటు వ‌దిలేయాలి.

Try This Home Remedy Once A Week For Glowing Skin Forever Home Remedy, Glowing

ఆపై వేళ్ల‌తో సున్నితంగా ర‌బ్ చేసుకుంటూ చ‌ర్మాన్ని శుభ్రంగా వాట‌ర్‌తో క్లీన్ చేసుకుని.ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.ఈ రెమెడీని వారానికి ఒక‌సారి ట్రై చేస్తే గ‌నుక డ‌ల్‌గా, కాంతిహీనంగా ఉన్న చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతూ అందంగా త‌యారు అవుతుంది.

పైగా ఈ రెమెడీ వ‌ల్ల చ‌ర్మంపై ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు