రారా రెడ్డిని రిజెక్ట్ చేసిన సదా..!

నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.నితిన్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో అంజలితో ఓ స్పెషల్ సాంగ్ చేయించారు.రారా రెడ్డి అంటూ వచ్చే ఈ సాంగ్ రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయ్యింది.అయితే ఈ సాంగ్ మధ్యలో నితిన్ మొదటి సినిమా జయం లోని సూపర్ హిట్ పాట రాను రానంటూనే చిన్నదే లిరిక్ ని రీమిక్స్ చేశారు.రారా రెడ్డి అంటూ పాట మొదలైనా సరే రాను రానంటూనే హమ్మింగ్ ఆడియెన్స్ కి నచ్చేసింది.

 Sada Reject Nitin Rara Reddy Special Song Chance , Krithi Shetty, Macharla Niyoj-TeluguStop.com

అయితే ఎలాగు రాను రానంటూనే అంటున్నాడు కాబట్టి ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన సదా చేతే ఈ పాట చేయించాలని అనుకున్నారట.చిత్రయూనిట్ సదాని ఈ పాట కోసం సంప్రదిస్తే తాను చేయనని చెప్పిందట సదా.

హీరోయిన్ గా ఆల్రెడీ ఫేడవుట్ అయిన సదా మొన్నటిదాకా ఓ టీవీ ఛానెల్ డ్యాన్స్ షోలో జడ్జ్ గా చేసింది.ఇక ఇప్పుడు అది కూడా లేదు.

మరి ఇలాంటి టైం లో నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగినప్పుడు చేస్తే చాలా బాగుండేది.

తప్పకుండా ఈ సాంగ్ ఆమె కెరియర్ కు ఉపయోగపడేది.

కానీ సదా మాత్రం ఈ టైం లో ఐటం సాంగ్ చేయడం ఇష్టం లేదని చెప్పిందట.సదా ఈ పాట చేసుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉండేదని చెపొచ్చు.

నితిన్ కోసమైనా సరే సదా మరోసారి రాను రానంటూనే చిన్నదో సాంగ్ చేస్తే బాగుండేది.పెద్దాగా అవకాశాలు కూడా లేని సదా వచ్చిన ఈ ఛాన్స్ కూడా కాదనుకుని పొరపాటు చేసిందని అంటున్నారు ఆడియెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube