భారతీయులకు గుడ్‌న్యూస్.. కోవాగ్జిన్ తీసుకున్న వారికి ఎంట్రీ, అమెరికా కీలక నిర్ణయం

కోవిడ్ కట్టడికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్‌కు ఊరట కలిగింది.

ఈ సంస్ధ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగపు అనుమతినిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేర్చేందుకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది.కోవాగ్జిన్ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ అడ్వైజరీ టీమ్ సమీక్ష నిర్వహించింది.

అనంతరం ఈయూఎల్‌లో చేర్చేందుకు అనుమతిచ్చింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం లభించినట్లయ్యింది.

ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది.దీంతో, కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులకు ఇప్పటి వరకు ఎదురవుతున్న ఆటంకాల నుంచి విముక్తి కలగనుంది.

Advertisement

ఈ టీకాను వేయించుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం గానీ ఉండదు.డబ్ల్యూహెచ్ఓ ప్రకటన తర్వాత అమెరికా సైతం కీలక నిర్ణయం తీసుకుంది.

కోవాగ్జిన్ రెండు టీకాలు వేయించుకున్న ప్రయాణీకులు నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి ప్రవేశించడానికి ఫెడరల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) లేదా డబ్ల్యూహెచ్‌ఓలు అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడిన వ్యాక్సిన్‌ను తీసుకున్న విదేశీ ప్రయాణీకులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ అమెరికా తన కొత్త ట్రావెల్ సిస్టమ్‌ని ప్రారంభించటానికి ఒక వారం ముందుగానే ఈ నిర్ణయం వెలువడటం విశేషం.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)లోకి చేర్చడంతో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సైతం దానిని ఆమోదించింది.

కాగా.యూఎస్ కొత్త ప్రయాణ నియమాల ప్రకారం.ఫైజర్ బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్, సినోఫార్మ్, సినోవాక్‌లను పూర్తిగా తీసుకున్న ప్రయాణీకులను అమెరికాకు అనుమతిస్తోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌.కోవిడ్ 19పై 78 శాతం సమర్ధత రేటును కలిగి వుంది.ఇది అల్ప, మధ్యాదాయ దేశాలకు అత్యంత అనుకులమైనదని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు